తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆగస్టు-2026 స్వాతంత్య్ర మాసం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న "సురక్ష కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ" సైబర్ అవగాహన ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మంగళవారం నాడు జిల్లా ఎస్పి కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఆగస్టు నెల పొడవునా సైబర్ నేరాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సైబర్ ఆధారిత ఆర్థిక నేరాలు, ముఖ్యంగా స్టాక్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు వంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు."సురక్ష కా తిరంగా" ప్రచార సందేశమైన "ఆగు – ఆలోచించు, నిజం నిర్ధారించు, సైబర్ భద్రత పెంచు" అనే మూడు అంశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.జాతీయ సైబర్ జాగృక్తా దివస్ సందర్భంగా 05.08.2026 నుంచి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు మరియు సాధారణ ప్రజల భాగస్వామ్యంతో నెల పొడవునా సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్ కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉంటేనే సైబర్ అవగాహన కలిగిన, సైబర్ సురక్షితమైన, సైబర్ స్వతంత్ర తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ, సైబర్ సెల్ సీఐ జితేందర్, ఎస్బి ll ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, సైబర్ సెల్ ఎస్సై జుబేదా బేగం సైబర్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ