Thursday, 17 September 2026 01:34:29 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

అన్ని రంగాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధికి కృషి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Date : 17 September 2026 12:14 PM Views : 18

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత రహదారి, రైల్వే, విమాన రవాణా సౌకర్యాల విస్తరణకు చర్యలు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడిఓసీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాకు విచ్చేసిన మంత్రికి జిల్లా కలెక్టర్ అంకిత్ పూల మొక్కను అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రజా పాలన దినోత్సవ సందేశాన్ని అందించారు. అనంతరం పత్రికా సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజన్నారు. హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. యువతకు నాణ్యమైన విద్య, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేలా విద్యా సంస్థలు, మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా సాగునీరు, విద్యుత్, మార్కెటింగ్, రవాణా సౌకర్యాలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విస్తృతమైన సహజ వనరులు, అటవీ సంపద, గిరిజన సంస్కృతి, బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. సింగరేణి సంస్థ ద్వారా బొగ్గు ఉత్పత్తి, పాల్వంచ థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిలో జిల్లా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. జిల్లాలో మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీతో పాటు ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో విద్యా, వైద్య రంగాల్లో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి రహదారి, రైల్వే కనెక్టివిటీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు . పాండురంగాపురం నుంచి మాల్కంగిరి వైపు రైల్వే మార్గం అభివృద్ధి ద్వారా భద్రాచలానికి రైల్వే కనెక్టివిటీ కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అమరావతి–జగదల్‌పూర్ జాతీయ రహదారిని కొత్తగూడెం, భద్రాచలం మీదుగా నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కొత్తగూడెం–ఇల్లెందు–హైదరాబాద్ మార్గాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు జిల్లాలోని ఇతర ప్రధాన రహదారులను అభివృద్ధి చేసేందుకు కూడా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. రహదారి, రైల్వే రవాణాతో పాటు గోదావరి నదీ మార్గం ద్వారా రవాణా అవకాశాలను అభివృద్ధి చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు సులభంగా చేరుకునేలా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా జిల్లాలో పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, పర్యాటకం, మౌలిక వసతులు తదితర అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం. విద్యాచందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి,జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :