Friday, 18 September 2026 03:09:04 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని పరిశీలించిన సీఈఓ బి నాగలక్ష్మి

Date : 14 July 2026 05:41 PM Views : 214

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ( తెలుగు వెలుగు ) : దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సర్ కార్యక్రమంలో భాగంగా జూలూరుపాడు మండలం లోని పలు గ్రామాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈఓ) శ్రీమతి బి. నాగలక్ష్మి ఈరోజు జూలూరుపాడు మండలంలో పర్యటించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం అమలు తీరును మాచినపేట తండా, అన్నారుపాడు మరియు పాపకొల్లు గ్రామాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్లస్టర్ లెవల్ స్పెషల్ ఆఫీసర్‌గా ఆమె ఈ కార్యక్రమం పురోగతిని సమీక్షించి, ఓటర్లతో మాట్లాడి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని, అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపులు నిర్ణీత గడువులో పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని విలేజ్ ఆర్గనైజేషన్ (VO) భవనాల నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతి సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లో ఏర్పాటు చేసిన డ్రైన్ల ఎండ్ సోక్‌పిట్లను పరిశీలించి, వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. పాపకొల్లు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) ద్వారా నిర్మించిన గ్రావెల్ రోడ్డును పరిశీలించారు. అలాగే జూలూరుపాడు గ్రామపంచాయతీలో చేపట్టిన మొక్కల నాటే కార్యక్రమాన్ని పరిశీలించి పర్యావరణ పరిరక్షణలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మండలంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించిన సీఈఓ ప్రారంభించాల్సిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి, కొనసాగుతున్న పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో మండల పరిషత్ అభివృద్ధి తాళ్లూరి రవి మండల పంచాయతీ అధికారి తులసి రామ్, ఏపీవో రామారావు, పి ఆర్ఏ ఈ నవీన్ కుమార్, గ్రామపంచాయతీ సర్పంచులు గ్రామపంచాయతీ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :