Sunday, 02 August 2026 06:19:46 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

గిరిజన సమాఖ్య మహాసభలను జయప్రదం చేయాలి : సిపిఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య

Date : 14 July 2026 05:11 PM Views : 97

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : గిరిజనుల హక్కులు, సమస్యల సాధనకు పోరాడుతాం 18న మహా ప్రదర్శన, 19న ప్రతినిధుల సభ మహాసభల ప్రచార కరపత్రాల విడుదల : సిపిఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య గిరిజన సమాఖ్య మూడో రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో మంగళవారం పట్టణ సమితి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన సమాఖ్య మహాసభల ప్రచార కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజనుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ నెల 18, 19 తేదీల్లో పాల్వంచలో తెలంగాణ గిరిజన సమాఖ్య (టిజిఎస్) మూడో రాష్ట్ర మహాసభలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతాయని వివరించారు. మహాసభల తొలిరోజు మధ్యాహ్నం భారీ ఎత్తున మహా ప్రదర్శన, బహిరంగ సభ ఉంటాయని, 19న ప్రతినిధుల సభ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ నందు జరుగుతుందని తెలిపారు. ఈ పోరాట మహాసభల్లో గిరిజనులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో సిపిఐ నాయకులు గెడ్డాడు నగేష్, మాచర్ల శ్రీనివాస్, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, ఎండి యూసుఫ్, నేరెళ్ల శ్రీను, కృష్ణ, వాడే రాములు, మండల రాజేశ్వర్ రావు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :