Saturday, 19 September 2026 01:41:42 AM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలి.. జిల్లా అదనపు కలెక్టర్ సౌరభ్ శర్మ

Date : 01 August 2025 01:15 PM Views : 744

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : శుక్రవారం నాడు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము నందు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు 2025 గోడపత్రికలను జిల్లా అదనపు కలెక్టర్ సౌరభ్ శర్మ ఆవిష్కరించారు . ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ సౌరభ్ శర్మ మాట్లాడుతూ ఈనెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అని, ఈ సందర్భంగా జిల్లాలోని 11 ప్రాజెక్టుల పరిధిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాధాన్యతపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు, తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవని పుట్టిన ప్రతి బిడ్డకు మొదటి గంటలోపు తప్పనిసరిగా తల్లిపాలు పట్టాలని, అలాగే బిడ్డకు మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆహారం అని, దీనిని ప్రతి తల్లి పాటిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించే విధంగా కార్యచరణ రూపొందించుకోవాలని సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వారోత్సవాలలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల సిబ్బంది, ఆశాలు, స్వయం సహాయక సంఘాలు, ఎన్జీవోలు, డి ఆర్ డి ఏ, లైన్ డిపార్ట్మెంట్లు సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ సౌరభ్ శర్మ తల్లిపాల వారోత్సవాల పోస్టర్ని ఆవిష్కరించి వారం రోజుల షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఏ రోజు ఏం చేయనున్నారు దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆగస్టు 1న ప్రతి అంగనవాడి కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. ఇందులో తల్లులకు తల్లిపాల ప్రాధాన్యతను వివరిస్తారు, రెండవ తేదీన ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాధాన్యతను తల్లులకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తారు, నాలుగో తేదీన అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించి అంగనవాడి టీచర్స్, ఆశా వర్కర్లు బ్రెస్ట్ ఫీడింగ్ పై అవగాహన కల్పిస్తారు. ఐదో తేదీన ఇంటింటికి వెళ్లి తల్లిపాల ప్రాధాన్యతపై ప్రచారం చేస్తారు, 6న చేతులను శుభ్రం చేసుకునే అంశంపై అవగాహన కల్పిస్తారు. ఏడోవ తేదిన స్వయం సహాయక సంఘాల సభ్యులు, మెప్మా, సెర్ఫ్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి, బ్రెస్ట్ ఫీడింగ్ పై విస్తృత అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జయలక్ష్మి, సిడిపిఓ లక్ష్మీ ప్రసన్న, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ పి.సంపత్, సూపర్వైజర్ రమా దేవి పోషణ అభియాన్ జిల్లా ప్రాజెక్టు అసిస్టెంట్ బి. రాము, బ్లాక్ కోఆర్డినేటర్ సోనీ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :