తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉందని , మాజీ శాసనసభ్యులు బిజెపి తెలంగాణ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు అన్నారు.ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పాల్వంచ కృతింగా రెస్టారెంట్లో సంఘటన, సంరచన పేరుతో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా మాజీ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర బిజెపి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మారుతినేని ధర్మారావు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని, ఈనెల 15 లోపు పోలింగ్ బూత్ కమిటీలు, మండల కమిటీలను పూర్తిచేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో పేదల అభివృద్దె ద్యేయంగా అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తొలగించిన తర్వాతే ఎస్సీ, ఎస్టీ బీసీ వర్గాల ప్రజలకు ఈరోజు సంక్షేమ పథకాల అందుతున్నాయని గుర్తు చేశారు. బలమైన ప్రజాస్వామ్య నిర్మాణమే బిజెపి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీకి పట్టంకట్టడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రకారీ యాప సీతయ్య మాజీ జిల్లా అధ్యక్షుడు కేవీ రంగా కిరణ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంపన సీతారామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలచెరువు శ్రీనివాసరావు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు కుంజా ధర్మ, సంస్థ గత ప్రబారి జల్లారపు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు పసుమర్తి సతీష్, మండల అధ్యక్షులు మండల ప్రహారీలు, అసెంబ్లీ కన్వీనర్, జిల్లా కౌన్సిల్ మెంబర్లు, తదితర నాయకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ