తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తేదీ 9-2-2025 ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొత్తగూడెం ssc 79-80 సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సుమారు 30 మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల నుండి కుటుంబముతో హాజరైనారు. ఈ కార్యక్రమమును DSP రెహమాన్ గారు, బ్రహ్మానంద రావు RTD HM, వెంకటేశ్వరరావు రవి బాల నికేతన్ HM గారు, గౌరవ ఆత్మీయ అతిథులుగా వచ్చి వారి విశిష్టమైన సలహాలు సూచనలు అందించారు. మరణించిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆ పాఠశాలలో చదివి వివిధ ఉన్నత ఉద్యోగాలలో ఉండి వారి వారి అనుభవాలను పదవులను మరిచిపోయి వారి చిన్ననాటి అనుభవాలను అనుభూతులను ఒకరితో ఒకరు పంచుకొని ఆనంద ఉత్సాహాలతో గడిపారు.
DSP గారు తమ సందేశంలో ఈ రోజుల్లో బాల బాలికలు మాదకద్రవ్యాలకు, సెల్ ఫోన్ లకు అలవాటు పడుతున్నారు. వారికి తాతలు మీరు సరైన మార్గంలో పెట్టాలని శేష జీవితమును ఆధ్యాత్మికతతోను, సమాజ సేవలోనూ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలోనూ పాల్గొని తోటి వారితో అనాధలకు, తోటి విద్యార్థులకు సేవ చేయాలని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ