Wednesday, 04 November 2026 08:54:09 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

గంజాయి సేవించిన ఐదుగురి అరెస్ట్ * : వివరాలు వెల్లడించిన కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్

Date : 12 August 2024 08:13 PM Views : 1433

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆగస్టు 12 (తెలుగు వెలుగు): గంజాయి సేవించిన ఐదుగురు యువకులను కొత్తగూడెం వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సోమవాతం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శేషగిరినగర్ వద్ద ద్విచక్ర వాహనంపై నిషేధిత గంజాయిని తరలిస్తున్న మోహనకృష్ణ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కి తలించినట్లు ఆయన తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరినగర్ కాలనీకి చెందిన మోహన కృష్ణ చింతూరు నుండి దిగుమతి చేసుకుని కొత్తగూడెంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో యువతకు గంజాయి అమ్ముతున్నట్లు విచారణలో తేలిందని ఆయన తెలిపారు.

మోహన కృష్ణ ఇచ్చిన సమాచారం మేరకు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ముప్పారపు కరుణాకర్ దాడులు నిర్వహించి గంజాయి సేవించే ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని, వారిని మాదకద్రవ్యాల మోతాదు గుర్తింపు పరికరాలతో పరీక్షులు నిర్వహించి అనంతరం కేసులు నమోదు చేసినట్లు వివరించారు. సదరు ఐదుగురిని కొర్టులో హాజరుపరచి రిమాండ్ కి తరలించినట్లు డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ వెల్లడించారు. ఈ సమావేశంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, ఎస్సై విజయ పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :