Monday, 02 November 2026 11:30:51 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

పరిశుభ్రత లక్ష్యంగా కార్పొరేషన్లో స్పెషల్ డ్రైవ్ : కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్

Date : 26 October 2026 05:28 PM Views : 94

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాల్వల పూడికతీత ముమ్మరంగా చేపడుతున్నాం కాల్వలపై అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దు డివిజన్లలో మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నాం : కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు సమగ్ర కార్యాచరణతో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ ప్రారంభించినట్లు కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ పరిధిలోని అన్ని డివిజన్లలో సోమవారం క్షేత్రస్థాయిలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలు డివిజన్లలో పర్యటించి పనుల పురోగతిని సమీక్షించిన అనంతరం మేయర్ మాట్లాడారు. నగర ప్రజారోగ్యాన్ని కాపాడటంలో శానిటేషన్ విభాగం పనితీరు అత్యంత కీలకమని, బస్తీలు, వీధుల్లో నిల్వ ఉన్న చెత్త చెదారాన్ని వెంటనే తొలగించాలని ఆదేశించారు. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత వీధుల్లో పేరుకుపోయిన ముళ్లపొదలను పూర్తిగా తొలగించి రోడ్లను శుభ్రంగా ఉంచాలని సూచించారు. మురుగునీరు నిలవకుండా నిరంతరం కాల్వల్లో పూడికతీత పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కాల్వలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టొద్దని, కాల్వలను ఆక్రమిస్తే ఉపేక్షించేదిలేదన్నారు. వ్యాధులు ప్రబలకుండా ముందుస్తు జాగ్రత్తగా పారిశుధ్య పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని పేర్కొన్నారు. ఈ డ్రైవ్‌లో శాశ్వత సిబ్బందితో పాటు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ప్రతి డివిజన్ పరిధిలో ప్రజల నుండి వచ్చే పారిశుధ్య సమస్యల ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా వెంటనే స్పందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వార్డుల వారీగా శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు నిత్యం పర్యవేక్షణ చేపడుతూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని అయన సూచించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :