Thursday, 17 September 2026 07:37:21 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రజా పోరాటాలకు రాజకీయ శిక్షణ ఎంతో దోహదపడాలి : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు

Date : 09 July 2026 04:50 PM Views : 144

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి పాలకుల ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాల ఉధృతిని పెంచాలి సమకాలీన సామాజిక సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించాలి కమ్యూనిస్టు పార్టీ ఆశయాల సాధనకు కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలి ప్రజా పక్షాన నిలబడి పోరాడటమే నాయకుల, కార్యకర్తల ప్రధాన బాధ్యత సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు ప్రజా పోరాటాలకు మూడు రోజులపాటు జరిగిన రాజకీయ శిక్షణ దోహదపడాలని, ప్రజలను చైతన్యపరిచి పోరాటాల వైపు నడిపించే చైతన్య తీసుకురావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సమావేశం గురువారం భద్రాచలంలోని రెడ్డి సత్రంలో జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల కౌన్సిల్ సభ్యుల రాజకీయ శిక్షణా తరగతుల ముగింపు అనంతరం ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల పాటు సాగిన శిక్షణా తరగతులపై సమగ్రంగా సమీక్ష జరిపారు. ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ అత్యంత కీలకమైనదని, ఇందులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకులు అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాల ఉధృతిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ సమకాలీన సామాజిక సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించాలన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆశయాల సాధనకు కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని, ప్రజా పక్షాన నిలబడి పోరాడటమే నాయకుల, కార్యకర్తల ప్రధాన బాధ్యతని అన్నారు. చలో ఢిల్లీ, జిల్లా వ్యాప్త పాదయాత్రలు, అంగన్వాడీ యూనియన్ పాదయాత్ర, గిరిజన సమాఖ్య రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని, అందుకోసం ప్రతి కార్యకర్త తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సూచించారు. నరాటి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర నాయకులు ముత్యాల విశ్వనాథం కల్లూరు వెంకటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ పుల్లారెడ్డి, ఎస్ డి సలీం, వెంకటేశ్వరరావు, సలిగంటి శ్రీనివాస్, మున్నా లక్ష్మీకుమారి, వి పూర్ణచంద్రరావు, చంద్ర నరేంద్ర కుమార్, కంచర్ల జమలయ్య, మువ్వ వెంకటేశ్వరరావు, రేసు ఎల్లయ్య, వాసిరెడ్డి మురళి, కందుల భాస్కర్, ఉప్పుశెట్టి రాహుల్, ఎస్ కే ఫహీమ్, దేవరకొండ శంకర్ తాతాజీ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :