తెలుగు వెలుగు టీవీ - వార్తలు / మణుగూరు : గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా పూసుగూడెం వద్ద హెలిప్యాడ్,పంప్ హౌస్,డెలివరీ పాయింట్ మరియు ఇతర పరిసర ప్రాంతాలలో భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ పరిశీలించారు.
అనంతరం బందోబస్తు నిమిత్తం అక్కడ విధులకు హాజరవుతున్న పోలీస్ అధికారులతో సమావేశమయ్యి వారికి కొన్ని సూచనలను చేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరు కేటాయించిన ప్రదేశాలలో వారు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్ ఐపిఎస్, పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్,ఇల్లందు డిఎస్పి చంద్రభాను మరియు సీఐలు,ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ