తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చుంచుపల్లి : ములకలపల్లి మండలంలోని మంగపేట గ్రామంలో కోటి 56 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని మంగళవారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘునాథరెడ్డి, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగామంత్రిప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని అన్ని గదులను మంత్రి పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి పంచాయతీరాజ్ అధికారులతో ఇంకా చేయవలసిన భవన నిర్మాణ పనులు త్వరితగతిగా పూర్తి చేయాలని ఆదేశించారు.జిల్లా వైద్యశాఖ అధికారితో మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కావలసిన పరికరాలు మందులు సిబ్బంది తదితర అవసరాలకు సంబంధించి నివేదికలు కలెక్టర్ కు అందజేయాలని ఆదేశించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులతో మాట్లాడుతూ వైద్యులు దేవుడితో సమానం అని, ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని, పల్లె ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే ఆశయంతో పక్కా భవనాలు నిర్మించడంతో పాటూ వైద్య సిబ్బంది, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి అన్నారు. వైద్యులు, సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ప్రజలకు సేవలందించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించి అభివృద్ధి పరచాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే మళ్లీ పరిశీలనకు వస్తానని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వ విజయ్ బాబు, కొత్తగూడెం ఆర్డీవో మధు,జిల్లా వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్, పంచాయతీరాజ్ శాఖ ఈఈ శ్రీనివాస్, ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశ్వరరావు మరియు వైద్యశాఖ అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ