తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూన్ రెండు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తొలి,మలి దశ ఉద్యమకారులను గుర్తించి వారిని గౌరవించాలని సోమవారం నాడు స్థానిక సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం నందు గల మీటింగ్ హాల్లో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికలలో ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన ఉద్యమకారుల హామీలను నెరవేర్చడంలో జాప్యం జరుగుతుంది అని రెండేళ్లు కాలయాపన చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కేకే కమిటీ పేరుతో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, నెల రోజులు గడుస్తున్నా ఆ యొక్క కమిటీ విధివిధానాలు బహిర్గతం చేయకపోవడం క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం పట్ల పలు విమర్శలు తావిస్తుందని, ఆనాడు శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ప్రాంతంలో మారుమూల గ్రామాలు తిరిగి క్షేత్రస్థాయి నివేదిక యుపిఎ ప్రభుత్వానికి ఎలా అందజేసిందో అలా ఈ కమిటీ అందజేయాలని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘాల పేరుతో నకిలీ సంఘాలు పుట్టకొస్తున్నాయ ని వారంతట వారు ఒక అప్లికేషన్ తయారు చేసుకుని వారి ఆర్థిక రాజకీయ స్వార్థం కోసం ఉద్యమకారులతో ఆడుకోవడం సబబు కాదని తెలిపారు, బైండోవర్, ప్రివెంటివ్ అరెస్టుల ఎఫ్ఐఆర్ ఇండెక్స్ లో ఉద్యమంలో లేని వాళ్ళని కూడా మేము చేర్పిస్తామని వారి ధనార్జన ధ్యేయంగా హామీలు ఇవ్వడం ఉద్యమకర్ల మనోభావాలు దెబ్బ తీయడమే అని వారు వాపోయారు. 2025 నుండి 2026 వరకు అనేక ఉద్యమకారుల సంక్షేమ సంఘాల పేరుతో బూటకపు సంఘాల పుట్టకొచ్చాయని, అటువంటి బూటకపు సంఘపు నాయకుల మాయమాటలు నమ్మి ఎవరు మోసపోవద్దని, కేకే కమిటీ కూడా ఎవరు పడితే వారు తీసుకువచ్చే ఎఫ్ఐఆర్ లు తీసుకోవద్దని ఉద్యమకారుల సమాచారం గానీ వారి యొక్క నిర్వహించిన కార్యక్రమాల వివరాలు గానీ డిస్టిక్ క్రైమ్ రికార్డ్ బోర్డు వద్ద డేటా ఉంటుందని దాని ఆధారంగానే ఉద్యమకారులను గుర్తించాలని డిసిఆర్బి దగ్గర పూర్తిస్థాయి సమాచారం ఉందని అవసరమైతే ఆనాటి సమైక్య రాష్ట్ర స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కూడా సమాచారం సేకరించవచ్చు అని వారు తెలిపారు. రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జిల్లాలోని ఉద్యమకారులకు సపరేటు గ్యాలరీ కేటాయించి గుర్తించి గౌరవించాలని లేనియెడల రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరు అయ్యే మంత్రులని ఎమ్మెల్యేలను అడ్డుకొని తీరుతామని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పొనుగోటి సంపత్, రాష్ట్ర జిల్లా నాయకులు నవతన్, తెలంగాణ సురేష్, తెలంగాణ క్రాంతి, సాంబా పూర్ణ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ