తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 25 తెలుగు వెలుగు ) తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ.. ముఖ్యంగా ఆడబిడ్డల ఆర్థిక స్వావలంబనపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించింది.జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో డ్వాక్రా మహిళా సంఘాల కు ఇందిర మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రామ దీపిక రేపాల లక్ష్మి మాట్లాడుతూ అనంతారం గ్రామంలో మొదటి దఫగా డ్వాక్రా సంఘాలలో 21 గ్రూపులకు గాను 210 మందికి మహిళా సభ్యురాలులకు ఇందిర మహిళా శక్తి చీరలు పంచుతున్నామని తెలిపారు. ఇది ఇలా ఉండగా గ్రామంలో కొంతమంది మహిళలు మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులకే చీరలు ఇస్తుండటం వలన.. రేషన్ కార్డు ఉన్నప్పటికీ కొందరు అర్హులకు అందక గందరగోళం నెలకొంది. పంపిణీ పారదర్శకంగా జరగాలని మహిళలు కోరుతున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ