తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టడానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రెండు టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు, ఈ టాస్క్ ఫోర్స్ బృందాలు విత్తన దుకాణాలను తనిఖీ చేస్తారు. అందులో భాగంగా ఈ రోజు కొత్తగూడెం ఏ డి ఏ యు నరసింహారావు ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ బృందం జూలూరుపాడు మండలంలోని పలు విత్తన దుకాణాలలో తనిఖీ చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ తనిఖీలలో వ్యవసాయ అధికారి జి దీపక్ ఆనంద్, సీఐ ఇంద్రసేనారెడ్డి, టాస్క్ ఫోర్స్ సీఐ ప్రవీణ్, మరియు సిబ్బంది పాల్గొన్నారు. టాస్క్ ఫోర్స్ సీఐ ప్రవీణ్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలను అరికట్టడానికి జిల్లా వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేపడతామని తెలిపారు. రైతులు ఎటువంటి ప్రలోభాలకు మోసపోవద్దని లైసెన్స్ కలిగిన విత్తన డీలర్ల నుండి మాత్రమే రసీదు పొంది కొనుగోలు చేయాలని తెలిపారు. నకిలీ మరియు హెచ్డి కాటన్ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని వారిపై పిడి యాక్ట్ ప్రయోగిస్తామని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ