Tuesday, 03 November 2026 06:49:50 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

లాభాల్లో కార్మికులకు వాటా కోసం చంద్రబాబుతో పోరాడి అనడు 10 శాతం వాటా సాధించిన కె.ఎల్‌. మహేంద్ర.

Date : 12 August 2026 07:31 PM Views : 133

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం.లాభాల్లో కార్మికులకు వాటా కోసం చంద్రబాబుతో పోరాడి అనడు 10 శాతం వాటా సాధించిన కె.ఎల్‌. మహేంద్ర. పెన్షన్‌ ప్రదాతగా కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత- ఎఐటియుసి కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్19వ వర్ధంతి సందర్భంగా నేడు శేషగిరి భవన్‌లో ఘన నివాళి. సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన కార్మిక నేత, పెన్షన్‌ ప్రదాత కె.ఎల్‌. మహేంద్ర సేవలు చిరస్మరణీయమని ఎఐటియుసి నాయకులు కొనియాడారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా కల్పించాలన్న డిమాండ్‌పై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో నేరుగా పోరాడి 10 శాతం లాభాల వాటా సాధించిపెట్టిన ఘనత కె.ఎల్‌. మహేంద్రకే దక్కుతుందని పేర్కొన్నారు. ఆయన 19వ వర్ధంతి సందర్భంగా బుధవారం కొత్తగూడెం శేషగిరి భవన్‌లో ఎఐటియుసి నాయకులు ఘనంగా నివాళులు అర్పించాచారు. ఈ సందర్భంగా వంగ వెంకట్ మాట్లాడుతూ, సింగరేణి సంస్థ నష్టాల్లో ఉంటే ఆ భారాన్ని కార్మికులపై మోపాలని ప్రభుత్వం భావించిన సమయంలో కె.ఎల్‌. మహేంద్ర కార్మికుల తరఫున గళమెత్తారని ఆయన గుర్తుచేశారు. సంస్థకు నష్టాలు వస్తే కార్మికుల జీతాలు కోత విధిస్తామనే విధానం ఉన్నప్పుడు. అదే సంస్థ లాభాల్లో నడిచినప్పుడు ఆ లాభాల్లో కార్మికులకు కూడా వాటా ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబట్టారని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కార్మికుల పక్షాన చర్చలు, పోరాటాలు సాగించి చివరకు సింగరేణి కార్మికులకు 10 శాతం లాభాల వాటా సాధించడంలో కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు.సింగరేణి కార్మికుల భవిష్యత్‌ భద్రత కోసం పెన్షన్‌ సౌకర్యం కల్పించడంలోనూ కె.ఎల్‌. మహేంద్ర విశేష కృషి చేశారని నాయకులు తెలిపారు.కార్మికుడు పనిచేసే కాలంలోనే కాకుండా పదవీ విరమణ అనంతరం కూడా గౌరవప్రదమైన జీవితం సాగించేందుకు పెన్షన్‌ ఎంతో అవసరమని భావించి దాని సాధన కోసం ఆయన ఉద్యమించారని గుర్తుచేశారు. అందుకే కార్మిక లోకంలో ఆయనను పెన్షన్‌ ప్రదాతగా గౌరవంగా స్మరించుకుంటున్నామని తెలిపారు.సింగరేణి కార్మికుల వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమం, హక్కుల సాధన కోసం కె.ఎల్‌. మహేంద్ర చేసిన పోరాటాలు నేటి కార్మిక ఉద్యమానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని అన్నారు. కార్మికుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రభుత్వాలు, యాజమాన్యాలతో పోరాడిన ఆయన సేవలను స్మరించుకోవడం ప్రతి కార్మికుడి బాధ్యతగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, బ్రాంచ్ కార్యదర్శులు రమణమూర్తి,గట్టయ్య, ఉపాధ్యక్షులు క్రిస్టోఫర్‌,సహాయ కార్యదర్శి రాము, ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్ , నాగయ్య,పిట్ కార్యదర్శిలు మధు కృష్ణ,భుక్య రమేష్,కమల్,సురేందర్,నాయకులు మాతంగి లింగయ్య ,బండారి మల్లయ్య, మండల రాజేశ్వరరావు,సాధనాల రమేష్, సోమయ్య,రమేష్,నర్సయ్య,తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :