తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ)పాల్వంచ పట్టణ అధ్యక్షునిగా పట్టణంలోని ఎర్రగుంటకు చెందిన నిట్ట నరసింహ రావును నియమిస్తూ గురువారం జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ నియామక పత్రం అందజేశారు.ఈ సంధర్భంగా కామేష్ మాటాడుతూ బహుజన రాజ్య స్థాపనకు ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలని,85 శాతం ఉన్న బహుజనులందరూ ఏక తాటి పైకి వచ్చి రాజ్యాధికారం సాధించాలని కోరారు.అదేవిగంగా పట్టణ అధ్యక్షుడు నరసింహరావు మాట్లాడుతూ ప్రజలు ఎగుర్కొంటున్న సమస్యలపై పట్టణ వ్యాప్తంగా పర్యటించి సమస్యల పరిష్కారం కోసం బూత్ స్థాయి నుండి కమిటీలు వేసి పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.నరసింహరావు ఆధ్వర్యంలో 30మంది యువకులు పార్టీలో చేరారు.వారికి యెర్రా కామేష్ పార్టీ ఖండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.పార్టీ జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జున రావు, కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షుడు నాగుల రవి కుమార్, నరసింహ రావు ను అభినందించారు.బొల్లం రఘు, వంక వసంత్, చాణక్య,నిట్ట వరుణ్, కొలుకుల పవన్, గుడివాడ ఆదిత్య తదితరులు పార్టీలో చేరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ