తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం రైల్వే స్టేషన్ దగ్గర కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి ని పూజిద్దాం - పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదం తో చేపట్టిన కార్యక్రమంలో ఎకో ఫ్రెండ్లీ మట్టితో చేసిన వినాయకుని బొమ్మలను కొత్తగూడెం శాసనసభ్యులు కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు ప్రజలకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే తో పాటు సిపిఐ పార్టీ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్కే. సాబీర్ పాషా,మున్సిపల్ కార్పొరేషన్ ఇంచార్జి కమీషనర్ మరియు భక్తులు పాల్గొనడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ