Friday, 18 September 2026 12:40:19 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణకు శాఖల సమన్వయం అవసరం -జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 04 November 2025 08:15 PM Views : 1183

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెరుగుదల, పర్యాటక అభివృద్ధి దృష్ట్యా చిత్తడి నేలల సంరక్షణ అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం ఐ.డి.ఓ.సి కార్యాలయం సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వెట్ ల్యాండ్ కమిటీ సమావేశం జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తో కలిసి నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలల గుర్తింపు, భౌగోళిక సరిహద్దుల నిర్ణయం, వాటి పరిరక్షణ, అభివృద్ధి, మరియు సుప్రీం కోర్టు ఆదేశాల అమలుకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల భౌగోళిక గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయడం అత్యవసరం. ఇందుకోసం అటవీ శాఖ, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, సర్వే విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోపు గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలి అని తెలిపారు.జిల్లాలో ప్రాధమికంగా 50 చెరువులను ఎంపిక చేసి, వాటిపై సమగ్ర సర్వే నిర్వహించాలి. వాటి భౌగోళిక సరిహద్దులను ఖచ్చితంగా నిర్ణయించి, క్షేత్ర ధృవీకరణ చెయ్యాలని ఆదేశించారు . గుర్తించిన చిత్తడి నేలల పరిధిలో ఎటువంటి నిర్మాణాలు, మానవ జోక్యం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.చిత్తడి నేలలు పర్యావరణ సమతుల్యతకు కీలకమైన జీవ వ్యవస్థలు. ఇవి వర్షపు నీటిని నిల్వ ఉంచి భూగర్భ జలాలను పునరుత్పత్తి చేయడంలో, వన్యప్రాణుల నివాస స్థలాలుగా, మరియు పర్యాటక అభివృద్ధికి అనుకూల వాతావరణంగా పనిచేస్తాయి. అందువల్ల చిత్తడి నేలల స్వరూపాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత” అని అన్నారు.వెట్ ల్యాండ్ ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో పర్యాటక శాఖతో కలిసి చర్యలు తీసుకోవాలని సూచిస్తూ, పర్యావరణ అనుకూల ప్రాజెక్టులను రూపొందించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా విద్యాచందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ సుజాత, జిల్లా పంచాయతీ అధికారి అనూష మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :