తెలుగు వెలుగు టీవీ - వార్తలు / : భద్రాద్రి కొత్తగూడెం, జూలూరుపాడు ఆగస్టు 18(తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల కేంద్రంలో జెపిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఆదివారం ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు .గ్రామానికి చెందిన యువత ఎంతో ఉత్సాహంగా, సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన జె పి ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఇడుపుల. రాజు మాట్లాడుతూ రక్తానికి ప్రత్యామ్నయం ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా కనుగొనబడలేదని, రక్తదానం ద్వారా మాత్రమే రక్తాన్ని సేకరించి, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడగలమన్నారు. గ్రామానికి చెందిన యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారని, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కల్లోజి దినేష్, గుత్తం బన్ను, రావట్ల నరేష్ చారి, నిమ్మటూరి ప్రవీణ్ కుమార్, మందపాటి సాగర్ , పసుపులేటి పవన్, వేమూరి కనకరాజు, బర్ల వంశీ, నేతకాని కిరణ్, భుఖ్య అజయ్, బురు గుమ్మల కరుణ , జువ్వి ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు .
Admin
తెలుగు వెలుగు టీవీ