తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డీసీసీ నియామకం కోసం టీపీసీసీ అబ్జర్వర్ల నియామకం ఖైరతాబాద్ అబ్జర్వర్ గా టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు తెలంగాణ పీసీసీ అబ్జర్వర్ల నియమకాన్ని ప్రకటిచించారు. ఈ మేరకు తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ గురువారం వెల్లడించారు. 33 జిల్లాలతో పాటుగా మున్సిపల్ కార్పొరేషన్ లకు 22 మంది ఏఐసీసీ అబ్జర్వర్లతో పాటుగా 84 మంది పీసీసీ అబ్జర్వర్లను ప్రకటించింది. ఇందులో ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా సీనియర్లను నియమించింది. ఈ పరిశీలకు నియమకంలో మహిళ నేతలకు సైతం అవకాశం కల్పించారు. ఖైరతాబాద్ జిల్లా ఏఐసీసీ అబ్జర్వర్ గా శక్తిసిన్హా గోహిల్, టీపీసీసీ అబ్జర్వర్లుగా ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మామిడాల యశశ్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు సంగమేశ్వరావ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు లను ప్రకటించారు. ఏఐసీసీ ఆదేశాలను అనుసరించి అబ్జర్వర్లు డీసీసీ ఆశావాహుల రెజ్యుమ్ పరిశీలించి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి, అధిష్టానానికి అందజేయనున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ