తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మార్చి 4 లైన్మెన్ దినోత్సవం సందర్భంగా జూలూరుపాడు లైన్మెన్లను ఏడి రవికుమార్ ఘనంగా సన్మానించారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ నిరంతర విద్యుత్ సరఫరా కోసం వారు పడే కష్టాన్ని, వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి అన్నారు.ఎండ, వాన, చలి అని చూడకుండా విద్యుత్ సరఫరా కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పని చేసే లైన్‌మెన్‌ల సేవలను గుర్తించి లైన్మెన్ వినోద్, భాస్కర్, నాగరాజు, షాకీర్,రజిని కాంత్ లకు స్వీట్లు పంచి, శాలువాలతో సత్కరించి, వారి కష్టాన్ని అభినందిచారు.
Admin
తెలుగు వెలుగు టీవీ