తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో మంగళవారం నిర్వహించిన టీజీ టెట్ జూన్–2026 మొదటి రోజు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటన లో తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా యంత్రాంగం ముందస్తుగా చేపట్టిన ఏర్పాట్లతో పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా జరిగాయని తెలిపారు . జిల్లాలోని అను బోస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరీక్షా కేంద్రంలో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. మొదటి సెషన్ (F/N)లో మొత్తం 145 మంది అభ్యర్థులు కేటాయించగా, 127 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, 18 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష నిర్ణీత సమయానికి ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగింది. రెండవ సెషన్ (A/N)లో కూడా 145 మంది అభ్యర్థులు కేటాయించగా, 123 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 22 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ సెషన్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించబడింది. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయడంతో పాటు భద్రతా చర్యలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలను కేంద్రంలో అందుబాటులో ఉంచారు. జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి అని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ