Thursday, 05 November 2026 11:03:13 PM
# ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తుల పరిశీలన 15 రోజుల్లో పూర్తి చేయాలి: సీఈవో సుదర్శన్ రెడ్డి. # స్మశానవాటికల పరిశుభ్రతకు మేయర్ గణేష్ ఆదేశం. # గ్రాడ్యుయేట్ల ఓటు నమోదు ముమ్మరం చేయాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # మురుసు తుఫాన్‌ బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ డిమాండ్. # భద్రాద్రి కొత్తగూడెంలో ఐఎఫ్‌ఎంఐఎస్ జిల్లా స్థాయి శిక్షణ విజయవంతం. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగులకు సువర్ణావకాశం: భారత్ హ్యుందాయ్‌లో ఉద్యోగాల భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు! # శాశ్వత పనులతో జిల్లాను మోడల్‌గా నిలపాలి: మంత్రి తుమ్మల. # తుపాను నష్టంపై మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్ష. # తుఫాను నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి: సీపీఐ డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా . # బేతుపల్లి చెరువు వరదల్లో చిక్కుకున్న 19 మంది సురక్షితం. # సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు

మారనున్న ధమ్మపేట సెంటర్, రోడ్డు రూపురేఖలు.ఎమ్మెల్యే కూనంనేని కృషితో ఫోర్ లైన్ రోడ్డు మంజూరు.

Date : 15 July 2026 08:38 PM Views : 324

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎమ్మెల్యే కూనంనేని కృషితో ఫోర్ లైన్ రోడ్డు మంజూరు. రూ.14 కోట్లతో ధమ్మపేట రోడ్డు అభివృద్ధి. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే.మారనున్న ధమ్మపేట సెంటర్, రోడ్డు రూపురేఖలు. కొత్తగూడెం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా స్థానిక శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రత్యేక చొరవతో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సాకారమైంది. నియోజకవర్గ పరిధిలోని ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఆయన చేసిన కృషితో ధమ్మమేట రోడ్డు అభివృద్ధికి మోక్షం లభించింది. దమ్మపేట సెంటర్ నుంచి కుంటినాగులగూడెం వరకు సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర అధునాతన ఫోర్ లైన్ (నాలుగు వరుసల) రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. ఈ మెగా రోడ్డు నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం రూ.14 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. ఈ రహదారి అందుబాటులోకి వస్తే స్థానిక ప్రజలతో పాటు, అశ్వారావుపేట వైపు రాకపోకలు సాగించే వాహనదారుల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రతిష్టాత్మక ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణ పనులకు అధికారికంగా శంకుస్థాపన ముహూర్తం ఖరారైంది. గురువారం నాడు జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వారితో పాటు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేతులమీదుగా ఈ పనులకు ఘనంగా శంకుస్థాపన నిర్వహించబోతున్నారు. నియోజకవర్గంలో రోడ్లు, డ్రెయిన్లు, వంతెనల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే కూనంనేని నిరంతరం శ్రమిస్తున్నారని ఈ నిధుల మంజూరు ద్వారా మరోసారి నిరూపితమైంది. ప్రజాపక్షంగా ఉంటూ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు కూనంనేని సాంబశివరావు గారు తెస్తున్న నిధులు, చేస్తున్న అభివృద్ధి పట్ల స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ నాయకులు కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :