Thursday, 02 July 2026 05:26:08 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

ఎన్నికల్లో హామీలు ఇచ్చి గెలుపొందినాక, పూట కొక మాటతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్

Date : 21 October 2024 03:21 PM Views : 432

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 21 (తెలుగు వెలుగు) జూలూరుపాడు లో బిజెపి మండల సమావేశంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలుపొంది, పూటకు ఒక్క మాట చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నది, రుణమాఫీ కావలసిన రైతులు 64 లక్షల మంది రైతులు ఉంటే 42 లక్షల రైతులకి మాత్రమే రుణమాఫీ చేస్తాం 31 వేల కోట్ల రూపాయలతో ఆగస్టు 15 లోపు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది వారు మాటిచ్చిన వరికైనా మాఫీ చేశారా చేయలేదు, రైతుకు పెట్టుబడి సాయం ఎకరానికి 15000 రూపాయలు రెండు పంటలకు ఇస్తామని హామీ ఇచ్చారు ఖరీఫ్ పంట కాలం అయిపోయినది ఇప్పుడైనా సరే పెట్టుబడి సాయం ఇస్తారని రైతులు ఎదురుచూస్తున్నారు కానీ ప్రభుత్వం ఈ సీజను ఇవ్వలేము అని చెప్పటం రైతులను మోసం చేయడమే , మహిళలకు నెలకు ₹2,500 పెన్షన్ ఇస్తామని, వృద్ధులకు ఇంట్లో ఎంతమంది వృద్ధులు ఉంటే అంతమందికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని, నిరుద్యోగులకు నాలుగు వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని, దళితులకు 12 లక్షల రూపాయలు ఇస్తామని, గిరిజనులకు 10 లక్షల రూపాయలు ఇస్తామని సాధ్యం కానీ హామీలను ఇచ్చి ప్రజలందరినీ కూడా మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినది, గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చెప్పి మాఫీ చెయ్యకపోవటం వల్ల ప్రజలు గద్దె దింపారు, కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది మీ ఎమ్మెల్యేలే మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి రోజు వస్తున్నది ,ఎందుకంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా పేద ప్రజలకు ఇల్లు ఇవ్వకుండా పది సంవత్సరాలు ప్రజలను మోసం చేసింది, కేంద్ర ప్రభుత్వం ఎంతమంది నిరుపేదలకు ఇల్లు కావాలన్నా ఇస్తామని చెబుతున్న కూడా ఉపయోగించుకోలేదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా నియోజకవర్గానికి 3,000 ఇల్లు ఇస్తామంటున్నారు, అంటే ఒక మండలానికి 500 ఇల్లు మాత్రమే వస్తున్నాయి ఒక మండలంలో వేల మందికి ఇల్లు కావాలి. కానీ కేవలం కొంతమందికే ఇల్లు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల్ని మోసం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం పేదలకు ఎన్ని ఇల్లు కావాలన్నా అర్హత ఉన్న అందరికీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, కానీ దాన్ని ఉపయోగించుకోకుండా కొంతమందికే ఇల్లు ఇస్తామని ఇందిరమ్మ కమిటీల పేరుతో పేదలని ఇబ్బంది పెడితే గత ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి కూడా పట్టింది ,కావున కాంగ్రెస్ పార్టీ మీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ డిమాండ్ చేశారు .ఈకార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్ ,బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్ ,బిజెపి మండల కార్యదర్శి భూక్య రమేష్ ,కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి సిరుపరపు పుల్లారావు ,గోపాల్ రావు ,నర్వనేని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :