తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగులకు మనోవికాసం కలుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కొత్తగూడెం రైటర్ బస్తీలోని భవిత కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భవిత కేంద్రంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నిర్వహణ విధానాలు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. అనంతరం కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటంచి వారికి అందుతున్న శిక్షణ, కల్పిస్తున్న సౌకర్యాలు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నాను.
దివ్యాంగ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన భవిత సెంటర్లలో అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుగా భవిత కేంద్రాలు ఉపయోగపడుతు న్నాయని,ప్రత్యేక అవసరాలు గల పిల్లల బోధన కోసం అవసరమైన అన్ని పరికరాలు, స్టడీ మెటీరియల్ తెప్పించాలని ఆదేశించారు. రెయిలింగ్, ర్యాంపు రాంప్ వంటివి పటిష్టంగా ఏర్పాటు చేయాలన్నారు. ఫిజియోథెరపిస్టు కచ్చితంగా కేంద్రానికి వచ్చేలా చూడాలని అన్నారు. భవిత కేంద్రంలో విద్యార్థుల నైపుణ్యాలను తీర్చిదిద్ది ప్రత్యేక పాఠశాల నుండి సాధారణ పాఠశాల కు పంపడానికి చేస్తున్న కృషికి సిబ్బందిని అభినందించారు. ప్రత్యేక అవసరాల పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎంఈఓ డాక్టర్ ప్రభుదయాల్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ