తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సొసైటీ అధ్యక్షులు మండే వీర హనుమంతరావు అధ్యక్షతన సుజాతనగర్ దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కూనంనేని, కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, సిపిఐ సాబీర్ పాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు యొక్క అవకాశాన్ని వినియోగించు కోవాలని ప్రతి రైతు ఇంకుడు గుంతలను తమ పొలంలో ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. అలాగే రైతులు ప్రభుత్వం కల్పిస్తున్న బోనస్ పొందాలంటే దాన్యం శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాన్ని తీసుకురావాలని అన్నారు. ప్రతి రైతుకు ప్రభుత్వం అందించే బోనస్ కాలంలో అదే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు,అధికారులు, అనధికారులు,రైతునాయకులు,రైతులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ