తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండా గ్రామంలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన బానోతు బాలు తన కుటుంబ సభ్యులతో మంగళవారం రాత్రి దేవుడి దర్శనానికి వెళ్లారు. గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న నగదు, బంగారాన్ని దొంగిలించారని తెలిపారు. ఉదయం తిరిగి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ రవి దర్యాప్తు చేపట్టారు.
Admin
తెలుగు వెలుగు టీవీ