Wednesday, 04 November 2026 11:10:48 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

42 శాతం బి,సి రిజర్వేషన్ను పార్లమెంట్లో పెట్టి బిల్లును ఆమోదించాలి

Date : 17 October 2025 04:06 PM Views : 330

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈనెల 18న జరుగు రాష్ట్ర వ్యాప్త బందును జయప్రదం చేయండి..బంద్ ఫర్ జస్టిస్ రాష్ట్ర బంద్ కు ఏఐవైఎఫ్ సంపూర్ణ మద్దతు - ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ కే, ఫహీమ్ దాదా బీసీ రిజర్వేషన్ల సాధనకు వివిధ బీసీ సంఘాలతో ఏర్పడి బీసీ ఐక్య కార్యచరణ కమిటీ బంద్ ఫర్ జస్టిస్ పేరుతో ఈనెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ ఏఐవైఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని.. అందులో భాగంగా కొత్తగూడెంలో బస్టాండ్ సెంటర్ ముందు అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రాస్తారోకో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ఉద్యమం తరహాలో ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు సాగాలని సూచించారు బీసీ బిల్లులను ఆమోదించి రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు జీవతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద నిన్న హైకోర్టు స్టే విధించడంతో రిజర్వేషన్ అమలు స్థానిక సంస్థ ఎన్నికలు నిలిచిపోడానికి దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమేనని ఇప్పటికైనా రాష్ట్రం నుండి ప్రతినిత్యం వహిస్తున్న బిజెపి ఎంపీలు కేంద్ర మంత్రులు నైతిక బాధ్యత వహించి వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కుల గణన సర్వే నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బిల్లు కేంద్రానికి పంపించిన స్పందించలేదన్నారు శాసనసభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించి ఆర్డినెన్స్ చేసి గవర్నర్ కి పంపించిన ఆమోదించకపోవడం వల్ల రిజర్వేషన్లు ఆగిపోయాయన్నారు, బిజెపి కులతత్వ మనోవాద పార్టీ అయినందున కుల వ్యవస్థ, అసమానతలు ఉండాలని మనోధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని కోరుకుంటుందని ఆరోపించారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు రావాల్సిన హక్కులన్నిటిని కాలరాస్తుందని ధ్వజమెత్తారు బీసీల పట్ల బిజెపికి చిత్తశుద్ధి ఉంటే తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేందుకు రాజ్యాంగ సవరణ ద్వారా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంటును సమావేశపరిచి ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న బిల్లులు నిర్ణీత కాలం పరిమితిలోగా ఆమోదం లభించకపోతే నోటిఫై చేయవచ్చని తమిళనాడులో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలన్నారు. రాష్ట్రం నుండి ప్రతినిత్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఎటువంటి ప్రయత్నము చేయలేదన్నారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఖయ్యుమ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉపేందర్, చంద్రగిరి ప్రసాద్, రసూల్ పాషా, రణధీర్, జావిద్,రాకేష్, రౌతు సురేష్, శివ, విజయ్ కాంత్, శ్రీకాంత్, వెంకట్, సోహెల్, అమన్, బాలు, సంజయ్, అభినయ్, చంటి గఫర్ తదితరులు పాల్గొన్నారు....

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :