తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం సిపిఐ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, సీనియర్ న్యాయవాది మునిగడప వెంకటేశ్వర్లు జన్మదినం సందర్భంగా కొత్తగూడెం బస్టాండులో పేదలకు, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందే వారికి150 మందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. నిత్యం ప్రజాక్షేత్రంలో సామాజిక బాధ్యతతో మెలిగే సీనియర్ న్యాయవాది మునిగడప వెంకటేశ్వర్లు తన వంతు సహాయర్థం పేద ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఒక న్యాయవాదిగా ప్రజలకు సేవలు అందించడం తనకు దక్కిన అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది తోట మల్లేశ్వరరావు, జియో ఉల్ హసన్, సబ్బని పాపారావు మరియు ప్రభుత్వ వైద్యశాల వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ