తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి ఇల్లందు పట్టణంలోని పల్లెధవాఖాన సబ్ స్టేషన్‌ను సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు. అన్ని రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, ఆరోగ్య సూచికలను మరింత మెరుగుపరచాలని సిబ్బందికి ఆదేశించారు. అనంతరం యూఎఫ్‌డబ్ల్యూసీ ఇల్లందు మరియు రొంపేడు, కొమరారం, గుండాల, సులహానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHCs)కు చెందిన MPHA(F)లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ముఖ్యంగా:ఎన్‌సీడీ (NCD) స్క్రీనింగ్ నవీకరణలు.అనీమియా ముక్త భారత్ కార్యక్రమం సమర్థ అమలు.సమతుల్య ఆహారం ప్రాముఖ్యత “ఈట్ రైట్ – డ్రింక్ రైట్” పై అవగాహన.అన్ని ఆరోగ్య కార్యక్రమాల సూచికల్లో పురోగతి సాధన వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది కట్టుబడి పనిచేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్, డాక్టర్ మధువారన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, మోహన్ dpmo మరియు ANM లు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ