Wednesday, 04 November 2026 08:58:50 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

సీనియర్ న్యాయవాది ఆళ్ల గురు ప్రసాద్ రావు మృతికి ఫుల్ కోర్ట్ రిఫరెన్స్

Date : 03 May 2025 07:49 PM Views : 1458

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీనియర్ న్యాయవాది, కమ్యూనిస్టు భావజాలానికి నిబద్ధుడైన ఆళ్ల గురు ప్రసాద్ రావు శనివారం ఉదయం విశాఖపట్నంలో పరమపదించారు. ఆయన మృతిపట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయవాదుల సంఘం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. వారి మృతికి సంతాపంగా శనివారం ఉదయం జిల్లా కోర్టు హాల్‌లో ఫుల్ కోర్ట్ రిఫరెన్స్‌ను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ అధ్యక్షతన, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి పి. వసంత్ ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి పి. వసంత్ మాట్లాడుతూ గురు ప్రసాద్ రావు అనేకమందికి ఉచితంగా న్యాయసేవలు అందించి, కొత్తగూడెం న్యాయవాద వృత్తిలో తనదైన స్థానం సంపాదించుకున్న గొప్ప న్యాయవాది. అటువంటి వ్యక్తిని కోల్పోవడం న్యాయవ్యవస్థకు తీరనిలోటు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎస్. సరిత, కె. కిరణ్ కుమార్, సుచరిత, కె. సాయి శ్రీ, బి. రవికుమార్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లులు పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. బార్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, సీనియర్ న్యాయవాదులు పలివెల గణేష్ బాబు, వై. ఉదయ భాస్కర్ రావు, Y. బాబురావు, కే. పుల్లయ్య, పోసాని రాధాకృష్ణమూర్తి, రమేష్ కుమార్ మక్కాడ్, జె. శివరాం ప్రసాద్, చండ్ర నరేంద్ర తదితరులు మాట్లాడుతూ, గురు ప్రసాద్ రావుతో తమకు ఉన్న అనుబంధాన్ని, ఆయన చేసిన న్యాయసేవలను గుర్తుచేసుకున్నారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జే గోపికృష్ణ ప్రధాన కార్యదర్శి బి మాధవరావు, మహిళా ప్రతినిధి అడపాల పార్వతి క్రీడల కార్యదర్శి ఉప్పు అరుణ్ పాల్గొన్నారు, ఈ కార్యక్రమం ముగింపులో రెండు నిమిషాల మౌనం పాటించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు, ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్, మహిళ న్యాయవాదులు మరియు లా ఆఫీసర్స్ పాల్గొన్నారు,

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :