Wednesday, 16 September 2026 09:50:22 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

జిల్లాలో మొదటి రోజు టెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 05 January 2026 10:17 AM Views : 290

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) మొదటి రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పూర్తిగా ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ కీలక పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు.జిల్లాలో టెట్ పరీక్షల నిర్వహణ కోసం మొత్తం రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజ్ నందు ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో రెండు సెషన్లకు కలిపి 200 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, మొదటి సెషన్‌కు 44 మంది, రెండవ సెషన్‌కు 38 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు.అలాగే అబ్దుల్ కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో రెండు సెషన్లకు కలిపి 200 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, మొదటి సెషన్‌కు 60 మంది, రెండవ సెషన్‌కు 74 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారని జిల్లా కలెక్టర్ వివరించారు.ఈ విధంగా మొదటి రోజు టెట్ పరీక్షలకు జిల్లాలో మొత్తం 400 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, అందులో 216 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరై, 184 మంది అభ్యర్థులు గైహాజరు అయినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 163 బి.ఎన్.ఎస్.ఎస్ సెక్షన్ అమలు చేస్తూ ప్రశాంత వాతావరణాన్ని కల్పించినట్లు ఆయన తెలిపారు.టెట్ పరీక్షల నిర్వహణలో పాల్గొన్న విద్యాశాఖ అధికారులు, కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, పర్యవేక్షకులు, సిబ్బంది, పోలీసు శాఖ అధికారుల సమన్వయంతో పరీక్షలు సజావుగా నిర్వహించగలిగామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. మిగిలిన పరీక్షలు కూడా ఇదే విధంగా ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :