Wednesday, 16 September 2026 05:29:36 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

'ప్రతి ఇంటికి పట్టా.. ప్రతి కుటుంబానికి ఇల్లు' నినాదంతో పోరుబాట

Date : 01 July 2026 05:29 PM Views : 101

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేసేవరకు ఉద్యమం ఆగదు ఇండ్లు కూల్చివేత చర్యలను పేదలపక్షాన ప్రతిఘటిస్తాం కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో స్థలాలు క్రమబద్ధీకరించి హక్కు కల్పించాలి : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇండ్లు, ఇండ్లస్థలాలకోసం వామపక్షాలు చేపట్టిన కలెక్టరేట్ ధర్నా సక్సెస్..భారీగా తరలివచ్చిన జనం 'ప్రతి ఇంటికి పట్టా.. ప్రతి కుటుంబానికి ఇల్లు' అనే నినాదంతో లాల్ జెండా పార్టీలు ప్రారంభించిన పోరుబాట, లక్ష్యం నెరవేరేవరకు ఆగబోదని, పేదలకు గూడు కల్పించేవరకు పాలకులకు కంటిమీద కునుకులేకుండా చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సిపిఐ, సిపిఎం, న్యూ డిమోక్రసీ, మాస్ లైన్ పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వామపక్షాల నాయకులు, కార్యకర్తలు, ఇండ్లు లేని వేలాది మంది పేదలు భారీ సంఖ్యలో కలెక్టరేట్‌కు తరలివచ్చి నాలుగుగంటలపాటు ఉదృతంగా ధర్నా కొనసాగించారు. ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరైన కూనంనేని ప్రజనుద్దేశించి మాట్లాడారు. నిరుపేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేసేవరకు వామపక్షాల ఆధ్వర్యంలో సాగే ఈ ప్రజా ఉద్యమం ఎంతమాత్రం ఆగదని స్పష్టం చేశారు. కొత్తగూడెం పట్టణ పరిధిలో జీవో నెంబర్ 76ను తక్షణమే పూర్తిస్థాయిలో అమలు చేసి, అర్హులైన నిరుపేదలందరికీ పట్టాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా పాల్వంచ పరిధిలోని జీవో నెంబర్లు 444, 999, 817, 727, 410 పరిధిలో దశాబ్దాలుగా నమ్ముకుని ఉన్న స్థలాలను తక్షణమే రెగ్యులరైజ్ చేసి అర్హులకు పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం సాయిబాబు మాట్లాడుతూ పేదలు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇండ్ల కూల్చివేత చర్యలను తక్షణమే మానుకోవాలని, ప్రభుత్వ నిరంకుశ కూల్చివేతలను పేద ప్రజలందరూ ఐక్యంగా ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పేదలు ఇండ్ల స్థలాలను తక్షణమే క్రమబద్ధీకరించి వారికి చట్టబద్ధమైన హక్కు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేదలు నిర్మించుకున్న ఇండ్లకు వెంటనే ఇంటి నెంబర్లు జారీ చేయాలని, తాగునీరు, విద్యుత్ సౌకర్యం వంటి కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు తక్షణమే అప్పగించాలని డిమాండ్ చేశారు. న్యూ డిమోక్రసీ జిల్లా నాయకులూ గౌని నాగేశ్వరరావు, మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కెచ్చల రంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, లేనిపక్షంలో కలెక్టరేట్లను, ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు ముత్యాల విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వరరావు, సరెడ్డి పుల్లారెడ్డి, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, సిపిఎం రాష్ట్ర నాయకులు అన్నవరపు కనకయ్య, వామపక్ష పార్టీల జిల్లా నాయకులు నరాటి ప్రసాద్, ఎస్ డి సలీం, సలిగంటి శ్రీనివాస్, రేసు ఎల్లయ్య, పూర్ణచందర్ రావు, కంచర్ల జమలయ్య, మున్నా లక్ష్మీకుమారి, వాసిరెడ్డి మురళి, భూక్యా దస్రు, రాహుల్, ఫహీమ్, ఎం జ్యోతి, లిక్కి బాలరాజు, బ్రహ్మచారి, రేపాకులా శ్రీనివాస్, తుపాకుల నాగేశ్వరరావు, ఎం సతీష్, కుంజా కృష్ణ, పెద్దబోయిన సతీష్, ప్రభాకర్, భాస్కర్, వీరభద్రం, శివ, కార్పొరేటర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :