తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు*అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట పటిమ తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నార సామాజిక అన్యాయం, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.భూమి, భుక్తి, విముక్తి కోసం నాటి నిరంకుశ పాలనకు ఎదురొడ్డి నిలిచిన ఐలమ్మ, అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన మహనీయురాలని అన్నారు.ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం, సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవాన్ని మరింత బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ సేవలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని, ఆమె త్యాగాలను స్మరించుకుంటూ సమానత్వం, సామాజిక న్యాయం సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాగా సీతారాములు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు, కార్పొరేటర్లు, వివిధ సంఘాల నాయకులు, పట్టణ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ