Wednesday, 04 November 2026 04:37:26 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

చర్ల సీహెచ్‌సీలో ఆరు నెలల్లో 100 శస్త్రచికిత్సలు. స్థానిక గిరిజనులకు వరంగా మారిన ప్రభుత్వాసుపత్రి.

Date : 30 April 2026 06:46 PM Views : 247

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిసర ప్రాంతాలకు వైద్య సేవల్లో కీలకమైన చర్ల ప్రభుత్వ ఆసుపత్రి గత ఆరు నెలల్లో 100 ట్యూబెక్టమీ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి మరో మైలురాయిని సాధించింది.గతంలో చర్ల ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ లేకపోవడంతో ట్యూబెక్టమీ వంటి శస్త్రచికిత్సల కోసం రోగులు 56 కి.మీ దూరంలోని ఏరియా ఆసుపత్రి భద్రాచలం వరకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో రోగులపై ఆర్థిక భారం, శారీరక ఇబ్బందులు అధికంగా ఉండేవి. ప్రస్తుతం సిజేరియన్ వంటి ప్రధాన శస్త్రచికిత్సలతో పాటు అత్యాధునిక టిఫా స్కానింగ్ సేవలు కూడా అందుబాటులోకి రావడం గమనార్హం.భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు సూచన మేరకు అప్పటి జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ ప్రత్యేక దృష్టి సారించి ఆరు నెలల క్రితం చర్ల ఆసుపత్రిలో నూతన ఆపరేషన్ థియేటర్‌ను ఏర్పాటు చేసి అవసరమైన పరికరాలు సమకూర్చారు. అలాగే మాతృ సేవలకు అవసరమైన ప్రసూతి, పిల్లల, మత్తు వైద్య నిపుణులను నియమించారు. దీంతో స్థానికంగా అన్ని వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి గిరిజన ప్రాంతాల ప్రజలకు పెద్ద ఊరట లభించింది.జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రత్యేక దృష్టి:ప్రస్తుతం జిల్లా కలెక్టర్ అంకిత్ చర్ల ఆసుపత్రిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇటీవలే ఒక రేడియాలజిస్ట్ వైద్య నిపుణురాలిని నియమించారు. అలాగే అత్యవసర సేవలు నిరంతరంగా అందుబాటులో ఉండేలా ముగ్గురు ఎంబీబీఎస్ వైద్యులు, ముగ్గురు శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేశారు.మరింత విస్తృత సేవల దిశగా కృషి – డీసీహెచ్ఎస్ డా. రవి బాబు:డీసీహెచ్ఎస్ డా. రవి బాబు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ నేతృత్వంలో భద్రాచలం శాసనసభ్యులు డా. తెల్లం వెంకట్రావు మద్దతుతో మరింత విస్తృత వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా 100 ట్యూబెక్టమీ శస్త్రచికిత్సల మైలురాయి సాధించినందుకు చర్ల ఆసుపత్రి వైద్య బృందం డా. కె. శ్రావణి, డా. కె. శివ రామకృష్ణ ప్రసాద్ మరియు ఆపరేషన్ థియేటర్ సిబ్బందిని అభినందించారు. అవసరమైన మద్దతు అందించిన జిల్లా కలెక్టర్ అంకిత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఓపీ గదుల ఏర్పాటు, పరికరాల మంజూరు చేసిన ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్‌కు ధన్యవాదాలు తెలిపారు. చర్లలో నిర్మాణంలో ఉన్న 30 పడకల నూతన భవనం పూర్తయిన తర్వాత మరింత మెరుగైన వైద్య సేవలు అందించగలమని పేర్కొన్నారు.హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు:చర్ల ఆసుపత్రిలో అందుతున్న సేవల పట్ల పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రతి చిన్న అవసరానికీ భద్రాచలం వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ అవసరం లేకపోవడం సంతోషకరమని తెలిపారు. ముఖ్యంగా గర్భిణి మహిళలకు చర్ల ఆసుపత్రి ఎంతో అనుకూలంగా మారిందని, దీంతో ఆర్థిక భారం మాత్రమే కాకుండా ప్రయాణ ఇబ్బందులు కూడా గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :