Friday, 18 September 2026 12:23:05 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి.

Date : 29 April 2026 07:57 PM Views : 354

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మణుగూరు టు తిరుపతికి షిరిడీకి ప్రత్యేక రైలు నడపాలి.మణుగూరు టు డోర్నకల్ కాజీపేట ప్యాసింజర్ రైలును తిరిగి నడపాలి.కొల్హాపూర్ బెల్గావి ఎక్స్ప్రెస్ ట్రైన్ ను కొనసాగించాలి.సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్ డి ఆర్ యు సి సి మెంబర్ వై. శ్రీనివాస్ రెడ్డి డిమాండ్.సికింద్రాబాద్ రైల్వే సంచలన్ భవన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్ డి ఆర్ యు సి సి మెంబర్స్ సమావేశం చాలా హాట్ హాట్ గా నడిచింది. ఈ సమావేశానికి హాజరైన డిఆర్ యు సి సి మెంబర్ వై. శ్రీనివాస్ రెడ్డి చర్చల్లో పాల్గొని మాట్లాడుతూ.. కొత్తగూడెం నుండి తిరుపతికి ప్రత్యేక రైలు నలుపుతామని హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదని ఎప్పుడు ఈ రైలు నడుపుతారని అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజీపేట డోర్నకల్ టు మణుగూరు వరకు గతంలో నడిపిన ప్యాసింజర్ రైలును, కొలహపూర్ బెల్గావి ఎక్స్ప్రెస్ ను ఎందుకు ఆపారని ఈ ట్రైన్స్ ను తక్షణమే నడపాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ పనులు గత నాలుగు సంవత్సరాలుగా నత్త నడక నడుస్తున్నాయని ప్రజలు ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.కొత్తగూడెం నడిబొడ్డున రాజీవ్ పార్కు ప్రగతి మైదానం ఎన్జీవోస్ కాలనీ మధ్యలో గత అనేక సంవత్సరాలుగా ఉన్న రైల్వే ట్రాక్ దారిని మూసివేసారని దీనివలన ప్రజలు,వాకర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే ఈ దారిని తిరిగి ఓపెన్ చేయాలనిగట్టిగా అధికారులకు విన్నవించారు. కొత్తగూడెం రైల్వేస్టేషన్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ ఫామ్ వన్ కు రాకుండా రెండవ ప్లాట్ ఫామ్ మీద ఆపుతున్నారని దీనివలన ప్రయాణికులు వృద్ధులు మహిళలు దివ్యాంగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తిరిగిసూపర్ ఫాస్ట్ ట్రైన్ నెంబర్ వన్ ప్లాట్ ఫామ్ మీదకు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కోరారు . కొత్తగూడెం రైల్వే స్టేషన్ సెంటర్ నుండి త్రీ టౌన్ గొల్లగూడెం సెంటర్ వరకు రహదారి వెడల్పుకు గౌరవపార్లమెంట్ సభ్యులు శ్రీ రఘురాం రెడ్డి గారి అభ్యర్థన మేరకు స్థలం తక్షణం ఏర్పాటు చేసి రహదారి వెడల్పుకు క్లియరెన్స్ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా రైల్వే సమస్యలపై వినతి పత్రాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే డివిజనల్ మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాల కృష్ణన్ గారికి శ్రీనివాస్ రెడ్డి అందించడం జరిగింది దీంతో అధికారులు స్పందిస్తూ సమస్యలను ఒక దాని వెంట ఒకటి సావధానంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు*సమావేశంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులు డి ఆర్ యు సి సి మెంబర్స్, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :