తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జయరాజును సన్మానించిన కలెక్టర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మీరు అందించిన స్ఫూర్తి, ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు, సుందర సమాజ నిర్మాణానికి చేస్తున్న కృషి ముందు తరాల వారికి ఆదర్శంగా ఉంటుందని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని, హైదరాబాదులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ స్ఫూర్తిదాతగా కోటి రూపాయల నగదు బహుమతి అందుకున్న జయరాజును మంగళవారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రత్యేకంగా ఆహ్వానించి, తన ఛాంబర్లో ఘనంగా శాలువాతో సత్కరించి, మొక్కను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రకృతి పరిరక్షణ కోసం మీతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. సన్మాన గ్రహీత జయరాజు మాట్లాడుతూ.. దేశం గర్వించే స్థాయిలో ఇంకుడు గుంతల నిర్మాణంలోనూ , రైతులకు మునగ సాగు ఎడల అవగాహన కల్పించడంలోనూ, జిల్లాను ముందు వరుసలో నిలపడం, జిల్లా ప్రజల అదృష్టం అన్నారు. ఈ సందర్బంగా జయరాజు, ప్రకృతి ఆశ్రమం కమిటీ సభ్యులు కలెక్టర్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి ఆశ్రమం సభ్యులు రాజేంద్రప్రసాద్, సైదులు, నాగ సీతారాములు, సుగుణ రావు, వెంకట ముత్యం, సురేష్, వరలక్ష్మి, శోభారాణి, సాగర్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ