తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఏజెన్సీల విభాగాల అధిపతులతో ధాన్యం కొనుగోలు సేకరణకు సంబంధించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో గౌరవ ముఖ్యమంత్రి గారు రెండో తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కి వస్తున్న కారణంగా మరియు ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద అధిక మొత్తంలో దాన్యం వచ్చే అవకాశాలు ఉన్నందును ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు రైతులకు ఇబ్బందులు తలేతకుండ తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప తహసిల్దార్లు పౌరసరఫరాల శాఖకు సంబంధించి మరియు డిఆర్ డి ఏ , డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ జిసిసి డీసీఎంఎస్ శాఖల ప్రతినిధులు వారి శాఖలకు సంబంధించి కార్యాచరణ నివేదించారు . అదనపు కలెక్టర్ ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకుండ కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ధాన్యం కొనుగోలు సక్రమంగా చేపట్టాలని సూచనలు జారీ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ