తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 11 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండలం అనంతారం గ్రామపంచాయతీ కార్యాలయం నందు గ్రామ సర్పంచ్ కొర్స రమేష్ ఉపాధి హామీ కూలీలకు పనిముట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలోనే ఉపాధి లభించేలా గ్రామ అభివృద్ధి పనులను ప్రోత్సహించేందుకు 2006లో ఇందిరమ్మ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి పేదల ఆకలి తీర్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే ఉపాధి హామీ పనులలో పట్టా భూమి కలిగిన రైతులు పొలంలో నీటి ప్రవాహాలు కలిగిన దగ్గర రాళ్లకట్టలు, భూమి చదును వంటి పనులను ఉపాధి హామీ కూలీల ద్వారా చేపించుకోవచ్చునని తద్వారా రైతులు లబ్ది పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుంజా రవికుమార్,పంచాయతీ సెక్రటరీ శైలజ ఫీల్డ్ అసిస్టెంట్ నాగమణి, ఉపాధి హామీ కూలీలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ