తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భదాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 17తెలుగు వెలుగు) : జూలూరుపాడు గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు కంచిపోగు వెంకట్ ఇటీవల అనారోగ్యంతో మరణించినారు. వారి కుటుంబ సభ్యులకు ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీషు, జిల్లా నాయకులు నున్న రమేష్ అందజేసినారు, ఈ సందర్భంగా బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు అనారోగ్యంతో కానీ ప్రమాదంతో గాని మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి అని కోరినారు . మన ప్రధానమంత్రి పేద ప్రజల కోసం ప్రధానమంత్రి సురక్ష యోజన పథకం కింద కేవలం సంవత్సరానికి 20 రూపాయలు చెల్లిస్తే రెండు లక్షల రూపాయలు ప్రమాద బీమా వస్తున్నది, మరియు ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకం కింద సంవత్సరానికి 432 రూపాయలు చెల్లిస్తే అనారోగ్యంతో మరణిస్తే రెండు లక్షల రూపాయలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినది ఈ పథకాలను పేద ప్రజలు ఉపయోగించుకోవాలి. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం మరియు ప్రధానమంత్రి మోడీ పుట్టినరోజు సందర్భంగా ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని చిలుకూరి రమేష్ అన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ