Monday, 03 August 2026 04:29:52 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

విద్య, వైద్యం రంగాలకు సీఎస్‌ఆర్ నిధుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి - జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 15 June 2026 06:28 PM Views : 54

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని సింగరేణి, కేటీపీఎస్, నవభారత్, ఐటీసీ తదితర పరిశ్రమల ప్రతినిధులతో సీఎస్‌ఆర్ నిధుల ద్వారా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టాల్సిన కొత్త పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు పాఠశాలల్లో తరగతి గదుల అభివృద్ధి, ఫర్నిచర్, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య వసతులు, డిజిటల్ విద్యా సౌకర్యాల ఏర్పాటు వంటి అంశాలకు సీఎస్‌ఆర్ నిధులను వినియోగించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలు, మౌలిక వసతులు, రోగుల సౌకర్యాల కల్పనకు పరిశ్రమలు సహకరించాలని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణకు అవసరమైన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అందుతున్న వినతులు, ఫిర్యాదులు, స్థానిక అవసరాల ఆధారంగా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సీఎస్‌ఆర్ నిధులను వినియోగించేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే పనులను ఎంపిక చేసి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ వేగవంతంగా అమలు చేయాలని చెప్పారు. గిరిజన, గుత్తికోయ ప్రాంతాల్లో విద్య, వైద్యం, తాగునీటి సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించిన కలెక్టర్, జిల్లాలోని అన్ని పరిశ్రమలు సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. సీఎస్‌ఆర్ నిధుల వినియోగం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని అన్నారు. సమావేశంలో పరిశ్రమల ప్రతినిధులు తమ సంస్థల ద్వారా ఇప్పటివరకు చేపట్టిన సీఎస్‌ఆర్ కార్యక్రమాల వివరాలను వెల్లడించగా, భవిష్యత్తులో చేపట్టనున్న పనులపై చర్చించారు. ఈ సమావేశం లో సి పి ఓ సంజీవరావు,సంబంధిత శాఖల అధికారులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :