తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుజాతనగర్ మండలం సింగభూపాలం గ్రామంలో చెవుల శ్రీను ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు పేదల సొంత ఇంటి కలలను నెరవేర్చడమే లక్ష్యంగా అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం రాబోయే 3 సంవత్సరాల్లో విడతల వారీగా 5 లక్షలు ఇస్తామన్నారు. ఇదే క్రమంలో ఎల్2 లో ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మిస్తామని, మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాలతో కూడిన గృహాల నిర్మాణానికి ప్రజా ప్రభుత్వం భాద్యత తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ