తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నేతాజీ రామవరం పాఠశాలలో నిర్వహిస్తున్న “నా మొక్క.. నా బాధ్యత” అనే మంచి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది పిల్లలకి safe touch, un safe touch గురించి తెలియచేయడం జరిగింది. dial 112 ఉపయోగం తెలియచేయడం జరిగింది. పిల్లలూ.. మొక్కను నాటడం అంటే కేవలం ఒక మొక్కను భూమిలో నాటడం కాదు.. మన భవిష్యత్తును నాటడం. ఈరోజు మనం నాటే చిన్న మొక్క రేపు పెద్ద చెట్టుగా ఎదిగి ఎన్నో తరాలకు నీడనిస్తుంది. స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. పర్యావరణాన్ని కాపాడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి.. దానిని మీ స్నేహితుడిలా భావించి సంరక్షించాలి. ప్రతిరోజూ దానికి నీరు పోయండి. దాని ఎదుగుదలను గమనించండి. మీరు పెరుగుతున్న కొద్దీ మీ మొక్క కూడా పెరుగుతున్న దృశ్యాన్ని చూడటం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా మీరు పాఠశాలలో బాగా చదువుకోవాలి. ఉపాధ్యాయులను గౌరవించాలి. తల్లిదండ్రుల మాట వినాలి. ఎవరైనా మిమ్మల్ని వేధించినా.. అసభ్యకరంగా ప్రవర్తించినా.. వెంటపడినా.. బెదిరించినా భయపడకండి. సమస్యను మనసులో పెట్టుకుని మౌనంగా ఉండకండి. వెంటనే మీ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ భద్రత కోసం పోలీస్ శాఖ తరఫున SHE టీమ్స్, AHTU పనిచేస్తున్నాయి. మీకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా పెద్దలకు చెప్పడానికి సంకోచించకండి. అలాగే ఆపదలో ఉన్నప్పుడు ఏం చేయాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు.. మహిళలు, బాలికలపై వేధింపులు జరిగినప్పుడు.. గొడవలు, బెదిరింపులు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు భయపడకుండా వెంటనే డయల్ 112కు ఫోన్ చేయండి. “ఆపదలో ఉంటే భయపడొద్దు.. 112కు కాల్ చేయండి.” పోలీసులకు సమాచారం అందించడంలో ఆలస్యం చేయకండి. సమయానికి సమాచారం అందిస్తే సత్వర సహాయం అందే అవకాశం ఉంటుంది పిల్లలూ.. మీరు మంచి విద్యార్థులుగా ఎదగడంతో పాటు మంచి పౌరులుగా కూడా ఎదగాలి. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న విజన్ ఆంధ్ర జిల్లా స్టాఫర్ ఉమా కాంత్ గారికి, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు నా అభినందనలు.
Admin
తెలుగు వెలుగు టీవీ