Friday, 18 September 2026 06:51:29 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

పోలింగ్ అధికారులు పూర్తి అవగాహనతో విధులు నిర్వర్తించాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన

Date : 06 February 2026 05:37 PM Views : 231

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా పూర్తిస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన తెలిపారు. శుక్రవారం పాల్వంచలోని అనుబోస్ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నియమితులైన పిఓ లు, ఏపీవోలు కు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో చిన్నపాటి తప్పిదం కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చని అన్నారు. అందువల్ల ప్రతి పోలింగ్ అధికారి పూర్తి అవగాహనతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు, అలాగే ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశను రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. ఓటింగ్ సామగ్రి నిర్వహణ, పోలింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతలు, ఓటర్లకు కల్పించాల్సిన సౌకర్యాలు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పారదర్శకత, నిష్పక్షపాతత్వం అత్యంత కీలకమని , ఎన్నికల కోడ్‌ను కఠినంగా పాటించాలని, ఎటువంటి అక్రమాలు లేదా అవకతవకలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. శిక్షణ కార్యక్రమంలో వివరించిన అంశాలను పూర్తిగా అవగాహన చేసుకుని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆమె తెలిపారు. శిక్షణ సందర్భంగా పోలింగ్ అధికారులు (పీ.ఓలు), అసిస్టెంట్ పోలింగ్ అధికారులు (ఏ.పి.ఓలు) వ్యక్తం చేసిన సందేహాలను జిల్లా ఎన్నికల మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ సవివరంగా నివృత్తి చేసి, ఎన్నికల నిర్వహణపై స్పష్టత కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి శ్రీరామ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :