Friday, 18 September 2026 06:15:22 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

మార్కోడు ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 22 January 2026 08:26 PM Views : 266

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మార్కోడు గ్రామంలోని ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం, తరగతి గదులు, హాస్టల్ గదులు, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్ తదితర మౌలిక వసతులను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు.మరుగుదొడ్ల పరిశీలన సమయంలో నీటి సరఫరా సక్రమంగా లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్, తక్షణమే చర్యలు తీసుకొని నిరంతర నీటి సరఫరా కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో పాఠశాల భవనంలో లికేజీ సమస్య ఉన్నట్లు ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా, అవసరమైన మరమ్మత్తులను వెంటనే చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.డైనింగ్ హాల్‌ను పరిశీలించిన కలెక్టర్, స్టాక్ రిజిస్టర్లు, వంట నిర్వహణ విధానాన్ని తనిఖీ చేశారు. పిల్లలకు శుభ్రమైన, పోషకాహారంతో కూడిన రుచికరమైన భోజనం తప్పనిసరిగా అందించాలని, వంట సిబ్బంది పరిశుభ్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థికి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలో కిచెన్ షెడ్ నిర్మాణానికి అవసరమైన నివేదికలను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వంటకట్టెలపై ఆధారపడుతున్న పరిస్థితిని గమనించిన కలెక్టర్, గ్యాస్ సరఫరా ఏర్పాట్లకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.అనంతరం మూడవ, ఆరవ, ఎనిమిదవ తరగతుల గదులను కలెక్టర్ పరిశీలించి విద్యార్థులతో మమేకమయ్యారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. విద్యను అభ్యసించడంలో శ్రద్ధ చూపాలని, జీవిత లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని సమయాన్ని వృథా చేయకుండా చదువుపై పూర్తి దృష్టి సారించాలని తెలిపారు. విద్యార్థుల చదవడం, రాయడం నైపుణ్యాలను పరిశీలిస్తూ బోర్డుపై రాయించి, పుస్తకాలు చదివించి వారి అభ్యాస స్థాయిని పరీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు సురక్షిత వాతావరణంతో పాటు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, పోషకాహారం తప్పనిసరిగా అందాలని తెలిపారు. పాఠశాలల నిర్వహణలో ఎక్కడా నిర్లక్ష్యం వహించరాదని, చిన్న లోపం కూడా విద్యార్థుల ఆరోగ్యం మరియు భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని అన్నారు. మరుగుదొడ్లు, నీటి సరఫరా, హాస్టల్ వసతులు ఎల్లప్పుడూ సక్రమంగా ఉండేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.అనంతరం మార్కోడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న కొత్త తరగతి గదులు, కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్, మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించి, పది రోజుల్లోగా అన్ని పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని, ఎలాంటి లోపాలు తలెత్తినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా చేపడుతున్న నిర్మాణాలకు అవసరమైన విద్యుతీకరణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ప్రధానోపాధ్యాయులు ముత్తయ్య, రామకృష్ణ, బోధన, బోధనీ తర సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :