తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 14 ( తెలుగు వెలుగు ) : విధులకు హాజరు కాకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సింగరేణి ఉద్యోగుల కఠిన చర్యలు చేపడతామని కొత్తగూడెం ఏరియా జీఎం శాలెం రాజు అన్నారు. బుధవారం రుద్రంపూర్ లో నిర్వహించిన కౌన్సిలింగ్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడమే అదృష్టమని, అటువంటి ఉద్యోగానికి రాకుండా, నిర్లక్ష్యపూరితంగా విధులకు గైర్హాజరైతే శాఖపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. పీవీకే ఫైవ్ ఇంక్లెన్, జే వి ఆర్.ఓసితో పాటు ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న 329 మంది ఉద్యోగులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్ లో భాగంగా ప్రతి ఉద్యోగి తో వారి కుటుంబ సభ్యులతో జిఎం శాలెం రాజు మాట్లాడారు, విధులకు గైర్హాజర్ కావడానికి గల కారణాలేంటో అడిగి తెలుసుకున్నారు. సింగరేణి ఉద్యోగానికి గల ప్రాధాన్యతను వారికి వివరించి, క్రమం తప్పకుండా నాగాలు లేకుండా, ఉద్యోగానికి రావాలని, సంస్థకు మంచి పేరు తెచ్చి మనుగడకు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ ఆఫీసర్ శివకేశవులు, పివికె ఓసి ఏజెంట్ బూర రవీందర్, పివికే మేనేజర్ శ్యామ్, డాక్టర్ శ్రీనివాస రెడ్డి, అధికారులు షకీల్, హరీష్, గోవర్దన్, ఖలీల్, సందీప్, కావ్య, ఐఎన్టీయూసి వైస్ ప్రెసిడెంట్ రజాక్, ఏఐటియుసీ ఏరియా నాయకులు గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ