తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుజాతనగర్ మండలానికి ఇటీవల బదిలీపై వచ్చిన ఎస్సై కేతవరపు కళ్యాణి ని నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా నాయకులు పలు మండలాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎస్సై కళ్యాణి ని పూల బొకే చేతికిచ్చి శాలువా కప్పి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. నాయి బ్రాహ్మణ సంఘం తరఫున అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సామాన్య కుటుంబాలనుండి ఉన్నత శిఖరాల వరకు ప్రతి ఒక్కరు చదువు చదువుకొని విద్యార్థి దశ నుండి ప్రతిభావంతులు మేధావులు అడుగుజాడలలో నడుస్తూ నాయి బ్రాహ్మణ ముద్దు బిడ్డలుగా ఎదగాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కళ్యాణి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రజలు సహకారం పోలీస్ శాఖ కు పూర్తి మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు ఉబ్బనపల్లి కాశయ్య (ప్యాన్సి) కురుమళ్ళ శంకర్ జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దడిగల మల్లేష్ వి కాశయ్య వి కృష్ణ మాడుగుల ముక్తేశ్వరరావు చుంచుపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు కడియాల శ్రీనివాస్ మందల కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ