Wednesday, 16 September 2026 06:03:04 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సజావుగా నిర్వహణకు నోడల్ అధికారుల నియామకం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 06 October 2025 07:18 PM Views : 513

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్, హైదరాబాద్ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరగబోయే జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికలను నిష్పాక్షికంగా, పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు వివిధ విభాగాల నోడల్ అధికారులను నియమించామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ప్రతీ దశలో సమన్వయంతో పనిచేసి, విధి నిర్వహణలో ఏ లోపం చోటు చేసుకోకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో వివిధ కార్యకలాపాలకు క్రింది అధికారులు నోడల్ అధికారులుగా నియమితులయ్యారు: 1. మానవ వనరుల నిర్వహణకు (Man Power Management) – బి. నాగలక్ష్మి, జిల్లా విద్యా అధికారి. 2. బ్యాలెట్ బాక్స్‌ల నిర్వహణకు (Ballot Box Management) – జె. నరేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి. 3. రవాణా నిర్వహణకు (Transport Management) – వెంకట రమణ, జిల్లా రవాణా అధికారి. 4. శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు (Training Management) – కె. శ్రీరామ్, జిల్లా ఉపాధి అధికారి మరియు సాయి కృష్ణ, సబ్జెక్ట్ అసిస్టెంట్, విద్యా శాఖ. 5. సామగ్రి నిర్వహణకు (Material Management) – జి. దినేశ్ కుమార్, సహాయ సంచాలకుడు (మైన్స్ & జియాలజీ) మరియు వై.టి.టి.వి. రమణ రావు, అకౌంట్స్ ఆఫీసర్, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం. 6. ఎంసీసీ (Model Code of Conduct) మరియు ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు (Expenditure Accounts Monitoring) – ఎం. విద్యా చందన, (ఎల్.బీ.) & జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (డీఆర్‌డిఏ). వ్యయ గణాంకాల సేకరణకు – కె. సంజీవరావు, జిల్లా ప్రణాళిక అధికారి. అభ్యర్థుల ఖర్చు లెక్కల పర్యవేక్షణకు – జి. శ్రీనివాస్, జిల్లా ఆడిట్ అధికారి. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు మరియు డేటా పర్యవేక్షణకు – మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల జనరల్ మేనేజర్. మోడల్ కోడ్ ఉల్లంఘన కేసుల పరిశీలనకు – ఎం. శ్రీనివాస్ చౌదరి, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్, స్పెషల్ బ్రాంచ్. చట్టపరమైన కేసుల నమోదు మరియు చర్యలకు – శ్రీ చి. శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్, స్పెషల్ బ్రాంచ్. 7. ఎన్నికల వ్యయ పర్యవేక్షణ నోడల్ అధికారి (Expenditure Monitoring) – ఎ. శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి. 8. ఆబ్జర్వర్ల సమన్వయానికి (Observer Coordination) – ఎస్. త్రినాథ్ బాబు, జిల్లా మేనేజర్, సివిల్ సప్లైస్. 9. బ్యాలెట్ పేపర్ ముద్రణ మరియు పోస్టల్ బ్యాలెట్ పంపిణీకి (Ballot Paper & Postal Ballot Printing & Distribution) – వి. బాబు రావు, జిల్లా వ్యవసాయ అధికారి. 10. మీడియా కమ్యూనికేషన్ మరియు సమాచార ప్రసారానికి (Media Communication) – మొహమ్మద్ అజ్గర్ హుస్సేన్, జిల్లా పౌర సంబంధాల అధికారి. 11. హెల్ప్‌లైన్ మరియు ఫిర్యాదుల పరిష్కారానికి (Helpline & Complaint Redressal) – శ్రీరామ్ సుశీల్ కుమార్, జిల్లా ఇన్ఫర్మాటిక్స్ అధికారి. 12. రిపోర్టులు మరియు నివేదికల సమర్పణకు (Reports & Returns) – బి. నాగలక్ష్మి, సీఈఓ, జిల్లా పరిషత్; కె. చంద్రశేఖర్, ఉప సీఈఓ, జిల్లా పరిషత్. 13. వెబ్‌కాస్టింగ్ పర్యవేక్షణకు (Web Casting) – జె. సైదేశ్వర రావు , ఈ-డీఎం, భద్రాద్రి కొత్తగూడెం.హెచ్. వెంకటేశ్వరరావు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి. నోడల్ అధికారులు అందరు ఎన్నికల నిర్వహణలో క్రమశిక్షణతో, సమయపాలనతో పనిచేసి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రజాస్వామ్య ప్రక్రియను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :