Saturday, 19 September 2026 08:53:04 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

ఓటు హక్కు వజ్రాయుధం : జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 23 January 2026 07:39 PM Views : 257

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన వజ్రాయుధమని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హత గల పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు.శుక్రవారం ఐ డి ఓ సి కార్యాలయ సమావేశ మందిరంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకు ఎంతో విలువ ఉందని, ఆ విలువను ప్రతి ఓటరు తెలుసుకొని తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఓటు హక్కుపై విస్తృత అవగాహన కల్పించడం ద్వారా సమర్థవంతమైన, బాధ్యతాయుతమైన పాలనను ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు.అధికారులు, యంత్రాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హత గల యువత ఓటరుగా నమోదు చేసుకునేలా, అలాగే తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ విస్తృత స్థాయిలో ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఓటర్లను ఎన్నికల ప్రక్రియలో విధిగా పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 25న దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓటు హక్కు కోసం గతంలో ఎన్నో త్యాగాలు, పోరాటాలు జరిగాయని, ఆ విలువను గుర్తించి అర్హత గల ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరిపై ఉందని అన్నారు.ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులతో కలిసి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల నిర్వహణను పరిరక్షిస్తామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఓ సంజీవరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని స్వర్ణలత లేనినా, బీసీ సంక్షేమ శాఖ అధికారిని విజయలక్ష్మి, ఏ ఓ అనంత రామకృష్ణ ఎన్నికల సూపర్డెంట్ రంగ ప్రసాద్, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఎన్నికల సిబ్బంది నవీన్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :